calender_icon.png 17 October, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యసేవలు

17-10-2025 12:53:34 AM

  1. ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల నుండి 100 పడకలకు పెంపు

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, అక్టోబర్ 26(విజయ క్రాంతి) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పే దలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రా వు అన్నారు. గురువారం ఆసుపత్రిలో ఎమ్మె ల్యే వైద్యశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి రోజు ఒక్కో రకం రంగులతో వాడే బెడ్ షీట్ ల వినియోగాన్ని ఎమ్మె ల్యే ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్బం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి సారి ప్రతి రోజు ఒక్కో రకం రంగులతో కొ న్ని బెడ్ షీట్ లను వినియోగించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించామని, ఈ విధానం వల్ల ప్రతిరోజు శుభ్రమైన బెడ్ షీట్లను గుర్తించవచ్చన్నారు.అదేవిధంగా జి ల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నూ తన భవన నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు.

గత నెలలో జిల్లా ప్రభుత్వ ఆ సుపత్రి రాష్ట్రంలోనే సేవల విషయంలో మొదటి స్థానంలో ఉందన్నారు. సెప్టెంబర్ మాసంలో 250 మంది గర్భిణి స్త్రీలకు ప్ర సూతి సేవలు అందించడం జరిగిందని, అలాగే గతంలో కంటే ఆసుపత్రిలో 26,730 ఓ.పి సేవలు అందించారని, 123 మంది గర్భిణి స్త్రీలకు టిఫా అనే స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారని, గత మాసంలో 316 మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించి వారందరికి ప్రైవేటుకు ధీటుగా వైద్యసేవలు అం దించామని అన్నారు.

జిల్లా ఆసుపత్రిలో గ్రా మీణ ప్రాంతాల ప్రజలు పెద్ద మొత్తంలో ప్ర భుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సహకారంతో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా జి ల్లా ఆసుపత్రి, మాత శిశు ఆసుపత్రి, పెద్దపల్లిలో అందించే సేవలను ఉపయోగించుకో వడం ద్వారా పెద్దపల్లి ప్రాంతంలోని సాధారణ ప్రజలకు సమిష్టిగా నెలకు సుమారు రూ. 7,04,10,000/- కోట్ల రూపాయలు ఆ దా చేయడం జరుగుతుందని,

అలాగే గత సంవత్సరంతో పోలిస్తే డెలివరీ కేసులు గణనీయమైన పెరుగుదల ఉందని, పైవేట్ ఆసుపత్రులకు దీటుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆ సుపత్రిలో కంటికి సంబంధించిన వైద్య సేవలు చేయడం జరుగుతుందని, నవజాతి శిశు కేంద్రం ద్వారా పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుం దని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రా రంభిస్తామని,

అలాగే రూ. 20 కోట్ల ఎక్విప్మెంట్ ఆర్డర్ పెడుతున్నమని, ఇందులో వెంటిలేటర్లు, ఎంఆర్‌ఐ, సిటి స్కాన్ లాంటి వి అందుబాటులో తెస్తామని, మరికొంత మంది రెగ్యులర్ డాక్టర్లను తెప్పిస్తున్నమని, మోకాళ్ళ మార్పిడి సర్జరీ చేయిస్తామని, ఏ ఒక్క పేషెంట్ కూడా అసంతృప్తితో ఇంటికి పోకూడదని, ఎలాంటి సమస్య ఉన్న సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటారని, ఆయనకు చెప్పండని, మీ సమస్యలను పరిష్కారం చేస్తాడని,

జవాబుదారీ తనం తో మే ము మా సిబ్బంది పని చేస్తారన్నారు. ఇప్పటికే పక్క జిల్లా ప్రజలు మన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని.అనంతరం కొత్తగా నిర్మితం అవుతున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు, డాక్టర్స్ మార్కెట్ చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.