calender_icon.png 17 October, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దె ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన యజమాని

17-10-2025 10:55:45 AM

హైదరాబాద్: నగరంలో అద్దె ఇంట్లో(Tenants Bathroom) సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. యూసుఫ్‌గూడలోని తన అద్దెదారులు ఉపయోగించే బాత్రూంలో రహస్య నిఘా కెమెరాను ఏర్పాటు చేశాడనే ఆరోపణలతో మధురానగర్ పోలీసులు ఇంటి యజమాని అశోక్ ను అరెస్టు చేశారు. అతని సహాయకుడు ఎలక్ట్రీషియన్ చింటూ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూసుఫ్‌గూడలోని(Yusufguda) జవహర్‌నగర్‌లోని అశోక్ ఇంట్లో ఒక జంట అద్దెకు ఉంటుంది. ఇటీవల బాత్రూమ్ లైట్ పనిచేయకపోవడంతో వారు యజమానికి సమాచారం ఇచ్చారు. అక్టోబర్ 4న, అశోక్, ఎలక్ట్రీషియన్ చింటూ బల్బును మార్చి..  బల్బ్ హోల్డర్ లోపల సీక్రెట్ కెమెరాను పెట్టారు. అద్దెదారులు అక్టోబర్ 13న సీక్రెట్ కెమెరాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రీషియన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని బాధితులు వాపోయారు. అద్దెదారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి అశోక్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనపై తన భర్తకు ఏమైనా అయితే మిమ్మల్ని వదిలిపెట్టనని ఓనర్ బెదిరించారు.