calender_icon.png 18 October, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగి దీపావళి గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

17-10-2025 09:46:17 AM

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) డియర్నెస్ రిలీఫ్‌ను 55శాతం నుండి 58శాతానికి పెంచింది. ఇది జూలై 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) ప్రకటించిన ఈ నిర్ణయం దాదాపు 28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని, వారి ఆర్థిక భద్రతను పెంచుతుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య లబ్ధిదారుల జీవితాల్లో సంతృప్తి, భద్రత శ్రేయస్సు దీపాన్ని వెలిగిస్తుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3శాతం డీఏ పెంపుపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.