17-10-2025 08:51:04 AM
హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం కొనసాగుతోంది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదిలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు(Telangana rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటు ఏపీలోని పలు జిల్లాకు వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుమల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. గంటలకు 35-55 కీలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.