calender_icon.png 18 October, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేలిన ట్రావెల్స్ బస్సు టైర్.. తప్పిన పెను ప్రమాదం

17-10-2025 09:37:09 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా(Anantapur District) గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. బెంగుళూరు నుండి రాయచూర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు(Fire Broke Out) చెలరేగాయి. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకి దింపడంతో తృటిలో పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న29 మంది సురక్షితంగా బయటపడ్డారని డ్రైవర్ వెల్లడించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదం ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.