17 March, 2026 | 1:54 AM

ఎమ్మెల్యే సామేలుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

17-03-2026 12:35 AM

రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి16:  తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని,అట్టి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్,తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్త్స్ర ఈట సైదులుకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుపై వ్యక్తిగత దూషణలు చేస్తూ శాసనసభ్యుడు అని కూడా చూడకుండా ఎమ్మెల్యే రూపురేఖలపై అవమానకరమైన భాషతో దుర్భాషలాడటం హేయమైన చర్య అని విరుచుకుపడ్డారు.

ప్రజల చేత ఎన్నుకోబడి,అత్యధిక మెజారిటీతో గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొప్పు భాష పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి సోమయ్య,బైరబోయిన రామలింగయ్య,కనుకు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే ఇంటి పై బీజేపీ దాడిని ఖండిస్తున్నాం..

తుంగతుర్తి, మార్చి 16 : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిపైన బిజెపి కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పిఎసిఎస్  చైర్మన్ గుడిపాటి సైదులు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు  తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం మాట్లాడుతూ, మొన్న గాంధీభవన్ లో జరిగిన ఎస్సీ చైర్మన్ గా కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే  మాట్లాడుతూ హిందూ మతాన్ని గాని హిందూ ధర్మాన్ని గాని కించపరిచినట్టుగా మాట్లాడలేదు.

కేవలం బ్రాహ్మణులు సంస్కృతంలో దీవించే వాక్యాలు అర్థం కాని రీతిలో ఉన్నాయని చెప్పడం జరిగింది దీనిపై నిన్న గాంధీభవంలో పత్రికా సమావేశం నిర్వహించి బ్రాహ్మణుల మనోభావాలు కించపరిచినట్టుగా అనిపిస్తే దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది .తను మాట్లాడిన మాటలు పొరపాటు అనిపిస్తే అపాలజీ చెప్పడం జరిగింది .

అయినా కూడా ఈరోజు ఉదయం హైదరాబాదులోని ఎమ్మెల్యే  నివాసంపై కొంతమంది బిజెపి కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తెలంగాణ ఉద్యమకారుడు దళితుడైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు  మీద కక్ష సాధింపు చేస్తున్న బండి సంజయ్  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదేవిధంగా కవ్వింపు చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దళిత సంఘాల కార్యకర్తలు అందరూ ఏకమై బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో  తుంగతుర్తి టౌన్  కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు, సర్పంచులు దాసరి రేణుక శ్రీను, మిర్యాల శ్రీను. సమిధన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ కాస్ట్రో, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ వీరబోయిన గంగరాజు యాదవ్, టౌన్ కాంగ్రెస్ నాయకులు బొంకూరి నాగయ్య, మల్లెపాక సుమన్, కొండ పరశురాం, అందె పర్శరామ్, తడక మల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.