5 May, 2026 | 7:04 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

కోదాడలో విశ్రాంత ఉద్యోగుల శాంతి ర్యాలీ

17-03-2026 12:36 AM

కోదాడ, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పెన్షనర్ల భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. అక్కడ ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావిళ్ళ సీతారామయ్య మాట్లాడుతూ  యుద్ధం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే కాకుండా, పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం వసుదైక కుటుంబంలా వర్ధిల్లాలని, యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కార్యదర్శి రఘువర ప్రసాద్, హాజీ నాయక్, పెన్షనర్లు పాల్గొన్నారు.