23 March, 2026 | 3:08 AM

ఆర్టీసీలో సూపర్వైజర్ పోస్టుల హాల్ టికెట్లు విడుదల

23-03-2026 01:25 AM

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): టీజీఎస్‌ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ (ట్రైనీ) ఉద్యోగాల భర్తీకి త్వరలో పరీక్షలు నిర్వహించ నుం ది. ఈ పరీక్షలకు హాల్ టికెట్లను ఆర్టీసీ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

ఒక వేళ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే (support@ tslprb.1n) కు ఈ మెయిల్ చేయవచ్చని అభ్యర్థులకు స్పష్టంచేసింది. లేదా 9391005006 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. అయి తే హాల్ టికెట్‌పై ఫొటో లేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపింది. పరీ క్ష సమయంలో అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలను సేకరిస్తారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చేతులకు మెహందీ, టాటూ లు ఉండకూడదని చెప్పింది.