13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

టీఆర్పీలో పలువురి చేరిక

23-03-2026 01:17 AM
  1. మన హక్కుల కోసం టీఆర్పీ పుట్టింది
  2. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి ౨౨(విజయక్రాంతి) : రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరహా చైతన్యానికి నాంది పలుకుతూ తెలంగాణ రాజ్యా ధికార పార్టీ (టీఆర్పీ) వైపు రోజురోజుకూ చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీసీ సమాజం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, యువకులు టీఆర్పీ వైపు మొగ్గు చూపడం గమనార్హం. అధికార పార్టీల్లో అన్యా యం ఎదుర్కొన్న వర్గాలు ఇప్పుడు తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు వస్తున్నాయి.

ఆదివారం హైదరాబాద్‌లోని టీఆ ర్పీ కేంద్ర కార్యాలయంలో నారపల్లి, కొర్రెముల ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్పీలో రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ బం దారపు నర్సయ్య గౌడ్, నాయకులు రాజేష్, కళ్యాణ్‌ల ఆధ్వర్యంలో చేరారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్తగా చేరిన వారికి కండువా కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఏండ్ల తరబడి బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయం చూసి ఇక మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు, మన భవిష్యత్, మన హక్కుల కోసం టీఆర్పీ పుట్టిందని స్పష్టం చేశారు.గ్రామ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఎక్కడ మన వర్గాల వారికి అన్యాయం జరిగినా పార్టీగా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మనందరం ఐక్యంగా పోరాడి గెలుద్దామని నినదించారు.

కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ,ఇప్పటివరకు మన వర్గాల కోసం ధైర్యంగా నిలబడే నాయకత్వం లేకపోవడంతో మౌనంగా ఉన్నామని తెలిపారు,ఇప్పుడు టీఆర్పీ రూపంలో ఒక బల మైన వేదిక లభించిందని, ఇక తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యామని ప్రకటించారు.కాగా టీఆర్పీలో చేరిన వారిలో ఎస్ అవినాష్,బి అనిల్,వీ వైదీక్,జీ జితేందర్,జీ కళ్యాణ్, పీ ప్రవీణ్, ఇ చింటూ,బీ గులాబ్ సింగ్,ఎన్ తుకారాం, వై మణిదీప్, సీహెచ్ సురేష్,బీ రాజేష్ ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్పీకి చెందిన పలు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.