15 April, 2026 | 5:05 PM

రాజకీయ అంటరానితనం పోవాలి

14-04-2026 01:13 AM

అన్ని కులాలకు రాజ్యాధికారం రావాలి

అంబేద్కర్, జ్యోతిరావ్ ఫూలే చూపిన మార్గమే శరణ్యం

రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ పూర్ణచంద్రరావు

తిరుపతి, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అంటరానితనాన్ని నిర్మూలిం చి, అన్ని కులాలకు సమాన రాజకీయాధికారం కల్పించాలని ఏఐబీఎస్‌పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్ర రావు డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ఫూలే ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంలో మాజీ మంత్రి పరసా రత్నం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి మాజీ మంత్రి పర్సా వెంకటరత్నం అధ్యక్షత వహించారు.

పెద్ద సంఖ్యలో పట్టణ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. డాక్టర్ జే పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీఆర్ అం బేద్కర్, జ్యోతిరావ్ ఫూలే చూపిన మార్గమే సమాజానికి శరణ్యమన్నారు. గత 80 ఏళ్లుగా 16 ఎన్నికలు జరిగినా, వందలాది కులాలకు అసెంబ్లీ గడప దాటే అవకాశం లేకపోవడం రాజకీయ అంటరానితనం కాకపోతే మరేమి టి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో దా దాపు 200 కులాలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నాయన్నారు.

అసెంబ్లీలో కొంత ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, ఆదివాసీ, మా ల, మాదిగ, యాదవ, గౌడ్, పద్మశాలీ వంటి వర్గాలకు అధికారంలో నిజమైన భాగస్వా మ్యం లేదని విమర్శించారు. అంకెలతో వివరిస్తూ, రాష్ట్ర అసెంబ్లీలో 175 స్థానాల్లో కమ్మ లకు సుమారు 35, రెడ్లకు 32 ఎమ్మెల్యేలు ఉం డగా, ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, ముస్లింలకు కేవలం 7 మంది బీసీలకు కేవలం 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్నారు. బీసీ వర్గాలు వందల కులాలు ఉన ్నప్పటికీ, పరిమిత ప్రాతినిధ్యమే ఉందన్నారు.

అందుకే అధికారానికి దూరంగా ఉంచారన్నారు. కమ్మ లు 3.31శాతం, రెడ్లు 4.82శాతం జ నాభా కలిగి ఉన్నప్పటికీ, కలిపి 8శాతం లోపే ఉన్న ఈ వర్గాలు సుమారు 67 ఎమ్మెల్యేలను సా ధించాయని, ఇది సమమైన ప్రజా స్వా మ్యానికి విరుద్ధమన్నారు. మెజారిటీ కులాలు అధికారానికి దూరంగా ఉండటం రాజకీయ అణచివేతకు నిదర్శనమని విమర్శించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిం చకపోవడం, మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, ఎస్టీ ప్రాంతాల్లో సరైన రాజకీయ అవకాశాలు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల నియా మకం, టీటీడీ వంటి సంస్థల్లో కొన్ని కులాల ఆధిపత్యం కొనసాగుతుండటం అన్యాయమ న్నారు. అన్ని కులాల పాలన రావాలి. ఇది ద్వేష రాజకీయాలు కాదు, సమాన హక్కుల కోసం పోరాటం అని స్పష్టం చేశారు.  మాల మాదిగ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రాక పోవడానికి రెండు కులాల పాలనే కారణమన్నారు. ఆ రెండు కులాలు రాష్ట్ర సంపదను ఒకరి తర్వాత ఒకరు దోచుకుంటున్నారని విమర్శించారు. మిగిలిన కులాలను దోచుకు తింటు న్నారన్నారు.

ఆదివాసీలకు పోలవరం ప్రాజెక్ట్ సాగు భూమిలో వాటా ఇవ్వడం లేద ని, అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల కు వాటా ఇస్తున్నారని రేణుకా చౌదరి పార్లమెంట్‌లో అన్నట్టు అమరావతి, కమరావతి అయిందని అదివాసిలను సవతి తల్లి బిడ్డల్లా చూస్తున్నారన్నారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీజేపీ అధికార మధుసూదన్ పార్టీల నేతలు మాట్లాడారు.