15 April, 2026 | 6:31 PM

ఏబీవీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం

15-04-2026 04:12 PM

ముకరంపుర,(విజయక్రాంతి): డా.  అంబేద్కర్  జయంతి సందర్భంగా కరీంనగర్ లోని అంబేద్కర్  విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న  ఏబీవీపీ కార్యకర్తలపై చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కరీంనగర్ సి పి గౌస్ ఆలం, ఏసీపి వెంకటస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఏబీవీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఈరోజు  కరీంనగర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. 

  స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ మాట్లాడుతూ అంబేద్కర్  జయంతి రోజున ఏబీవిపి కార్యకర్తలు విద్యార్థులతో కలిసి అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేయడం నేరమా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదా ప్రజాస్వామ్యం అంతం అయిందా అని ప్రశ్నించారు.  జరిగిన దాడి పై వెంటనే ముఖ్యమంత్రి , డిజిపి ఈ ఘటనపై స్పందించాలని, విచక్షణ మరిచి దాడి చేసిన కరీంనగర్ సిపి గౌస్ ఆలం, ఏసీబీ వెంకటస్వామి ఇరువురిని విధుల నుండి తొలగించాలని దాడికి పురిగొల్పిన  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ అజయ్,జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, హాస్టల్ కన్వీనర్ భామండ్ల నందు,  తదితరులు పాల్గొన్నారు.