29 August, 2026 | 12:40 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

15-04-2026 04:17 PM

 ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): అర్హులందరికీ పథకాలు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 132 మంది లబ్ధిదారులకు, రెబ్బెన మండలం తహసీల్దార్ కార్యాలయంలో 99 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.