15 April, 2026 | 6:23 PM

మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగిన బీజేపీ నాయకులు

15-04-2026 04:28 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం అంబేడ్కర్ 135 వ జయంతి వారోత్సవాల సందర్భంగా బిజెపి నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు  కడిగి సన్మానించారు, జిల్లా అధ్యక్షులు కర్రెసంజీవరెడ్డి., సుల్తానాబాద్ మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కర్రె  సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణాభివృద్ధికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు గొప్ప సేవలు అందిస్తున్నారని, అందువల్ల అంబేడ్కర్ జయంతి సందర్భంగా వారిని సత్కరించడం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కాసెగోని నిర్మల, మాన్ కి బాత్ కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీపీ కునారాపు రేణుక దేవి, పుచ్చకాయల హనుమంతరెడ్డి,ఈ కార్యక్రమ కన్వీనర్ ఎనగందుల ఎల్లయ్య, కోట నాగేశ్వర్, లంక శంకర్, బండారి లత, మల్కా భాగ్యలక్ష్మి, ఎర్రం సంతోష్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్,ఆగండ్ల గట్టయ్య, ఆగండ్ల శంకర్ , మాటూరి వెంకటస్వామి,గోస్కుల రవి, శాలిగంటి కొమురయ్య, దాసరి చందు తదితరులు పాల్గొన్నారు..