శ్రీ విద్యా శక్తి పీఠంలో ఆధ్యాత్మిక వేడుకలు
నాగోల్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): శ్రీ విద్యా శక్తి పీఠంలో బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతం ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతోంది. ఈ వ్రతం ముగింపు సందర్భంగా మే 27, 2026 శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నాగోల్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావును ఆహ్వానించేందుకు సోమవారం ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా ఉపాసకు లు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మతో పాటు శైలజ, శిరీష, నాగరత్న, నిరంజన్ దేశాయ్, అన్నావజ్జుల సూర్య ప్రకాష్, రామ సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై దైవ అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.






