మఠంపల్లిలో ఘనంగా మేడే వేడుకలు
01-05-2026 02:32 PM
మఠంపల్లి మే 01 (విజయ క్రాంతి): ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో మఠంపల్లి మండల కేంద్రంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు, త్యాగాల ఫలితమే మేడే వేడుకలు అని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేష్ గౌడ్, శుభోదయం అధ్యక్షులు జయభారత్ రెడ్డి, వల్లపు దాసు శీను,ఆటో యూనియన్ అధ్యక్షులు,మార్కెట్లో కార్మికులు, వృక్ష కార్మికులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.






