1 May, 2026 | 4:25 PM

అసోం సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు.. పవన్‌ ఖేరాకు ముందస్తు బెయిల్‌

01-05-2026 03:20 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖెహరా(Pawan Khera)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పవన్ ఖెహరా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. అసోం సీఎం మహింత భార్యకు 3 పాస్ పోర్టులు ఉన్నాయని పవన్ ఖెహరా తెలిపారు. అసోం పోలీసులు పవన్ ఖెహరాపై పరువు నష్టం, ఫోర్జరీ కేసులు పెట్టారు. పరువునష్టం కేసులో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అసోం ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.  అసోం ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.