1 May, 2026 | 5:16 PM

అన్ని దానాలకన్న అన్నదానం మిన్న

01-05-2026 03:59 PM

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ 

మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కందుకూరి పద్మ- ప్రకాశ్ రావు (పెద్దన్న ) దంపతుల చిన్న  కుమారుడు చిరంజీవి.కందుకూరి సాయి అఖిల్ (యు ఎస్ ఏ) పుట్టినరోజు ను పురస్కరించుకొని శుక్రవారం    స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంలోని వికలాంగులకు అన్నదానం, పండ్లు, స్వీట్లు, టవల్స్ పంపిణీ చేయడం జరిగింది. 

కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన బిరుదు రాధాకృష్ణ, మినుపాల ప్రకాష్ రావు లు మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా పేదలకు, మానసిక వికలాంగులకు అన్నదానం చేయడంఅభినందనీయమన్నారు. ఇలాంటి సేవాభావాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, ఊట్ల వరప్రదీప్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్,స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, సామల హరికృష్ణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు,సీనియర్ జర్నలిస్టు  కొమురవెళ్లి భాస్కర్, యేల్లె రాజు,  యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.