17 June, 2026 | 12:22 AM

కడియాల కోసం వృద్ధురాలిని హత్య

16-06-2026 09:19 PM

పటాన్ చెరు: కాళ్ళ కడియాల కోసం ఓ వృద్ధురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం శివారులో  సంచలనంగా మారింది. చిట్కుల్ గ్రామానికి చెందిన బండ్రోల్ల గౌరమ్మ (70) కాళ్లకు ఉన్న కడియాలను చూసి అదే గ్రామానికి చెందిన వడ్డె యాదయ్య, వడ్డె నర్సమ్మ ను ఈ నెల 13 న మోటర్ సైకిల్ పై ఇంద్రేశం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు.

మృతురాలి కూతురు బండ్రోల్ల లక్ష్మి ఈ నెల 14 న తన తల్లి కనిపించడం లేదంటూ చేసిన ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లు దుకాణంలో పరిచయమై కాళ్లకు ఉన్న కడియాల పైన యాదయ్య కన్నేశాడు. వృద్ధురాలిని నరసమ్మతో కలిసి బైక్ పైన ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి కాళ్లకు ఉన్న కడియాలను తీసుకు‌ని హత్య చేశారు. 

సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు యాదగిరి, నర్సమ్మ దంపతులను పటాన్ చెరు పోలీసులు చాకచక్యంగా పట్టుకుని విచారించారు. గౌరమ్మ ను హతమార్చిన  ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శేరిలింగంపల్లి ఎసిపి శ్రీనివాస్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గౌరమ్మను హత్యచేసిన నిందితులు వడ్ఠే యాదయ్య,వడ్డే నరసమ్మ అలియాస్ లలితలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై దొంగతనం కేసులు ఉన్నట్లు సీఐ వినాయక్ రెడ్డి తెలిపారు.