17 June, 2026 | 12:20 AM

ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెంచాలి: ఎంఈవో

16-06-2026 09:16 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో నాగారం శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు పాఠశాల హెచ్ఎం వెంకటేశం, బన్సీలాల్, టీచర్లతో సమావేశమై విద్యాబోధన అంశాలపై మాట్లాడారు. పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య వివరాలపై చర్చించారు. పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అయన సూచించారు.