18 July, 2026 | 12:41 AM

పెద్దపల్లిలో రూ.3 కోట్లతో బందంపల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం

18-07-2026 12:17 AM

ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి, జూలై 17(విజయ క్రాంతి)పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బందంపల్లి చెరువు కట్టను రూ.3 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎ మ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణ రావు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చేపట్టిన ఈ అభివృద్ధి పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాన్ని అందించాలనే లక్ష్యంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.

చెరువు కట్టను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తీగల వంతెన నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో పాటు గుత్తేదారుకు ఆదేశాలు జారీ చేశారు.

అవసరమైతే చెరువు కట్ట అభివృద్ధికి అదనపు నిధులు కూ డా తీసుకొస్తామని చెప్పారు.పెద్దపల్లి పట్టణాన్ని దశలవారీగా ఆధునిక సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్న ఆయన, మినీ ట్యాంక్ బండ్ త్వరలోనే ప్రజలకు అందుబాటులో కి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నుగుల్లా మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, స్థానిక కౌన్సిలర్ పురేళ్ల శైలజా సుధాకర్, ఇరిగేషన్ శాఖ అధికారు లు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.