రేణుకాచౌదరికి చేదు అనుభవం

01-05-2024 12:50:48 AM

ఖమ్మం, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆమెను ఓ కార్యకర్త తిరుగుబాటు ధోరణిలో ప్రశ్నించడం కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పు డు చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కా ర్యాలయంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రు లు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో  వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా రేణుకాచౌదరి మా ట్లాడుతూ.. సమావేశంలో కూర్చున్న వారెవరూ తనకు గత సమావేశాల్లో కనపించలేదన్నారు.

నాయకులు పదవుల కోసం పాకులాడకూడదన్నారు. కొందరు పదవులు పొంది కూడా ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలపై కొందరు కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఓ కార్యకర్త స్పందిస్తూ ‘మీరు ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండి, ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తే అని ఎలా?’ అని ప్రశ్నించాడు. దీంతో రేణుకా చౌదరి కార్యకర్తను పరుష పదజాలంతో దూషించారు.