14 July, 2026 | 4:59 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

బావిలో పడి బాలుడి మృతి

03-11-2024 12:48 AM

ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్ర వెళ్లి మండలం  అనంతపూర్ గ్రామానికి చెందిన తుడసం లాల్‌శావ్(11) శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు గ్రామంలో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.

శనివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావి లో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. బావిలోని నీటిని పరిశీలిస్తున్న క్రమంలో జారిపడి ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా లాల్‌శావ్ 6వ తరగతి చదువుతున్నాడు.