ఆత్మీయుల్ని కలిపిన విరిగిన పన్ను
18 ఏళ్ల క్రితం తప్పిపోయిన యువకుడు
విరిగిన పన్ను చూసి గుర్తుపట్టిన సోదరి
కాన్పూర్, జూన్ 29 : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఇద్దరు తోబుట్టువులను కలిపింది. 18 ఏళ్లుగా ఎక్కడున్నాడో తెలియని తన తోబుట్టువును ఓ సోదరి ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా గుర్తించగలిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్ సమీపంలోని హాథీపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమారి అనే మహిళ రీల్స్ చూస్తుండగా.. విరిగిన పంటితో ఉన్న ఓ వ్యక్తి రీల్స్‌లో కనిపించాడు. అయితే, అందులో ఉన్నది తమ కుటుంబానికి దాదాపు రెండు దశాబ్దాలుగా దూరంగా ఉంటున్న తన సోదరుడు బాల గోవిందగా గుర్తుపట్టింది. వెంటనే ఆ అకౌంట్ ద్వారా గోవిందతో చాటింగ్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసింది. ఫోన్ నంబర్ తీసుకొని ఇంటికి రావాలని కోరింది. దీంతో గోవింద్ ఈనెల 20న తన స్వగ్రామానికి వచ్చాడు.






