11 July, 2026 | 10:37 PM

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

30-06-2024 01:46 AM

రెండు కార్లు ఢీకొని ఆరుగురు మృతి

ముంబై, జూన్ 29 : ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు రాంగ్ రూట్‌లో వెళ్లి మరో కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది. జల్నా జిల్లాలోని కద్ వాంచీ గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అక్కడున్న ఓ పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుకున్న స్విఫ్ట్ డిజైర్ కారు ముంబైకి వెళ్లేందుకు రహదారిపైకి ఎక్కింది అయి తే, డ్రైవర్ నిర్లక్ష్యంతో రాంగ్ రూట్‌లో హైవేపై ఎంటరయ్యాడు. ఆరు లేన్ల ఈ హైవేపై ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఎర్టిగా కారు దాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఎర్టిగా వాహనం గాల్లోకి ఎగిరి బారీకేడ్లపై పడింది. గాల్లోకి కారు ఎగరడం వల్ల అందులోని ప్రయాణికులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమా దంలో ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఎక్స్‌ప్రెస్ హైవేపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.