23 April, 2026 | 4:54 AM

నేపాల్ నదిలో పడిన బస్సు

24-08-2024 12:00 AM

27 మంది భారతీయ ప్రయాణికుల మృతి

40 మంది టూరిస్టులతో పోఖరా నుంచి ఖాట్మాండు వెళ్తుండగా ఘటన

న్యూ ఢిల్లీ, ఆగస్టు 23: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు 40మంది యాత్రికులతో శుక్రవారం నేపాల్‌లోని ఖట్మాండూ వెళ్తుండగా అదుపుతప్పి తానాహుస్ జిల్లాలోని మార్స్యాంగి నదిలో పడిపోయిన ఘటనలో 27మంది ప్రయాణికులు చనిపోయారు.  మరో 16మందికి గాయాలయ్యాయని తనాహుస్ జిల్లా డీఎస్‌పీ దీప్‌కుమార్ రాయ్ తెలిపారు. 40 మంది భారత ప్రయాణికులతో కూడిన పర్యాటక బృందం నేపాల్‌లోని ఖట్మాండ్‌కు వెళ్తున్న క్రమంలో గురువారం రాత్రి ఫోఖ్రాలోని మజేరి రిసార్ట్‌లో భారతీయ ప్రయాణికులు బస చేశారు. మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం యాత్రికులతో కూడిన బస్సు ఖాట్మండు వెళ్తుండగా మార్గమధ్యలో భారీవర్షం పడటంతో నేపాల్‌లోని నది వద్ద అదుపుతప్పి పడిపోయింది. అనంతరం అది ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది.