15 March, 2026 | 12:58 PM

‘పీవీఎన్‌ఆర్’పై స్తంభాన్ని ఢీకొన్న కారు

05-11-2024 12:33 AM

ఫ్లుఓవర్‌పై మధ్యలో పడిపోయిన వాహనం 

రాజేంద్రనగర్, నవంబర్ 4 : మెహిదీపట్నం వైపు నుంచి సోమవారం ఆరంఘర్ వైపునకు వెళ్తున్న ఓ కారు ఉప్పర్‌పల్లి సమీపంలో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పై అదుపుతప్పి డివై డర్‌పై ఉన్న ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొని రోడ్డు మధ్యలో బోల్తాపడింది. దీంతో రెండు వైపుల వాహనాలు భారీగా స్తంభించాయి. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రా జేందర్ గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కారును రోడ్డు పైనుంచి తొల గించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాగా, ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి.