22 June, 2026 | 7:55 PM

Breaking News

ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •  

స్కూల్ గేటు మీద పడి విద్యార్థి మృతి

05-11-2024 12:31 AM

ఎల్బీనగర్, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. స్కూలు గేటు మీద పడడంతో ఓ విద్యార్థి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. హయత్‌నగర్ డివిజన్‌లోని ముదిరాజ్ కాలనీకి చెందిన అలంకటి చందు కుమారుడు అజయ్(6) హయత్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో 1వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాఠశాల గేటు ఎక్కి అ టూ ఇటూ ఊగుతున్నాడు.

ఈ క్రమంలోనే గేట్ వెల్డింగ్ జాయింట్లు ఊడి పోయి అజయ్‌పై పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఉపాధ్యాయు లు వెంటనే స్థానికంగా ఉన్న కృష్ణవేణి దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం సూర్యోదయ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అజయ్ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.