సినినటుడు ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు చేయాలి
సుల్తానాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కేరళ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో సీనినటుడు ప్రకాష్ రాజ్ హిందూ ఆరాధ్య దేవుళ్లయిన శ్రీరాముడు, సీతా మాత, లక్ష్మణుల వారిపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ప్రకాష్ రాజ్ పై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్త్స్ర చంద్రకుమార్ కి బీజేపీ నాయకులు ఆదివారం పిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ రామాయణాన్ని అవమానిస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వలస కూలీలు అని,వారు పండ్లు దొంగతనం చేయడం వలనే రామ రవణ యుద్ధం జరిగింది జరిగినట్లు మాట్లాడినందుకు, గతంలో కూడా చాలాసార్లు హిందూ దేవుళ్లపై అవహేళనగా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న కారణంగా ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యాదర్శి కొల్లూరు సంతోష్ కుమార్,మేకల కిరణ్, చిట్టవేణి సదయ్య, ఆగండ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు..






