20 April, 2026 | 3:27 AM

అయ్యప్ప స్వామి పూజ నియమావళి పుస్తక ఆవిష్కరణ

20-04-2026 01:45 AM

సత్తుపల్లి, ఏప్రిల్ 19. ( విజయక్రాంతి ): అయ్యప్ప స్వామి మాల ధారణ ప్రాముఖ్యత, పూజ నియమావళి, భక్తి గీతాలను పొందుపరుస్తూ సుమారు సంవత్సర కాలం శ్రమించి మొండ్రు క్రాంతి కుమార్(గురు స్వామి) స్వీయ రచన, సమకూర్పుతో రూపుదిద్దుకున్న పుస్తకాన్ని కిష్టారం కోదండ రామాలయం ఆలయ కమిటీ సభ్యులు నరుకుళ్ళ శేషగిరిరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిష్టారం గ్రామ సర్పంచ్ నరుకుళ్ళ రాజేశ్వరి అప్పారావు హాజరయ్యారు.  అనంతరం మొండ్రు క్రాంతి కుమార్ (గురు స్వామి) మాట్లాడుతూ హిందువుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తానని, చిన్నారులకు బాల్యంలోనే విద్యతోపాటు హిందూ ప్రాముఖ్యత తెలుపుతూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పుస్తక ముద్రణకు సహకరించిన జేష్ట శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావి నాగేశ్వరరావు, మాచినేని నరేంద్ర, కొడిమెళ్ళ అప్పారావు, కొలపనేని ధనుంజయ్, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.