కానిస్టేబుల్ కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందజేత
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 25:బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు విడో కార్పస్ ఫండ్ కింద రూ.1 లక్ష చెక్ను వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అందజేశారు. వనపర్తి జిల్లా రేవల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందిన కానిస్టేబుల్ శివకుమార్ భార్య సుజాతకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చెక్ను అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సునిత రెడ్డి మాట్లాడుతూ, పోలీసు కార్పస్ విడో ఫండ్ పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ సంక్షేమానికి తోడ్పడుతోందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏఓ, సూపరింటెండెంట్ సునందన, రాజవర్ధన్, మరణించిన కానిస్టేబుల్ శివకుమార్ భార్య సుజాత తదితరులు పాల్గొన్నారు.




