ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధుల ఐక్యతకు జర్నలిస్ట్ క్రీడలే వేదిక
జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక,ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్చిరెడ్డిపల్లి క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న జర్నలిస్ట్ కప్ -26 క్రికెట్ టోర్నమెంట్ పినపాకలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిధి గా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడా మైదానంలో మొక్కను నాటారు. టోర్నమెంట్ లో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
ఇలాంటి క్రీడా పోటీల ద్వారా జర్నలిస్టులుప్రభుత్వ యంత్రాంగం మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో జర్నలిస్టు జట్లతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య, పంచాయతీ రాజ్, విద్యుత్, ఇతర ప్రభుత్వ శాఖల జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు రెండు కీలక స్థంభాలుగా పనిచేస్తున్నారని అన్నారు.
ఇలాంటి క్రీడా పోటీలు పరస్పర అవగాహన, ఐక్యత, స్నేహాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంబించి కాసేపు బ్యాటింగ్ చేసి అందరినీ అలరించారు. అనంతరం వివిధ శాఖల జట్లను పరిచయం చేసుకుని మొదటి మ్యాచ్ ని ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. మండలంలో ఉన్న ఈ క్రీడా మైదానాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని హామి ఇచ్చారు.
ఈకార్యక్రమంలో పినపాక ఎంపిడీవో వెంకటేశ్వర రావు, ఎస్‌ఐ సురేష్, గిర్థావర్ శరత్, ఎంఈఓ నాగయ్య, సర్పంచులు సోడే విజయలక్ష్మి, తోలెం స్వప్న, మద్దెల సమ్మయ్య, వాగబోయిన చందర్రావు,పూణెం వెంకటేశ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కీసర సుధాకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు బూరాశంకర్,బిల్లా నాగేందర్, సనప భరత్, ముక్కు మహేష్ రెడ్డి, కట్టా శ్రీనివాసరావు, అత్తె లక్ష్మి నారాయణ, బొల్లె నరేష్, కొంపెల్లి సంతోష్, ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా జర్నలిస్టులు మరియు ప్రభుత్వ శాఖల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.




