30-06-2025 08:02:57 PM
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: కూచిపూడి నృత్యంలో రాణిస్తున్న చిన్నారిని పలువురు అభినందిస్తున్నారు. బాలికలు చదువులోనే కాదు కళల్లోను చక్కని ప్రతిభ కనబరుస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా(Suryapet District) జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బింగి అనిల్ కుమార్-రమాదేవి దంపతుల కుమార్తె చిరంజీవి షష్టిక 7 సంవత్సరాల ప్రాయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శనివారం తిరుపతిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొని హౌరా అనిపించింది. బింగి షష్టిక తండ్రి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ తమ కూతురును హైదరాబాదులోని ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ మధుమతి వద్ద శిక్షణ ఇప్పించాడు. చిన్నారి షష్టిక సాంప్రదాయ నృత్యంలో రాణిస్తూ ఉండడంతో నృత్య గురువు డాక్టర్ మధుమతితో పాటు పలువురు అభినందించారు.