8 May, 2026 | 2:53 AM

అర్ధరాత్రి బ్యాంకులో అలజడి

23-06-2024 02:19 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్22 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణబ్యాంకులో శుక్రవారం రాత్రి రెండున్నర గంటలకు ఎమర్జెన్సీ సైరన్ మోగడంతో స్థానికులు 100కు డయల్ చేశారు. పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని, బ్యాంకు అధికారులకు సమాచారం అందించడంతో బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్‌రావు, సిబ్బంది హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో బ్యాంక్‌ను తెరచి, చోరీ ఏమైనా జరిగిందా అని పరిశీలించారు. ఎలాంటి దొంగతనం జరగకపోవడంతో ఊపరి పిల్చుకున్నారు. సాంకేతిక లోపంతో అలారం మోగిందా, ఎవరైనా బ్యాంకులోకి ప్రవేశించి వెళ్లారా అనే అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఫాల్స్ అలారం మోగినట్లుగా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం.