పాల రైతులకు రూ.11.50 కోట్ల బకాయి
23-06-2024 02:22 AM
- కామారెడ్డి విజయ డైయిరీ ఎదుట ఆందోళన
కామారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): పాడి రైతులను అదుకుంటామని ప్రభుత్వం ఒక వైపు గొప్పలు చెబుతున్న ఆచరణలో మాత్రం నేరవేరడం లేదు. కామారెడ్డి జిల్లాలో విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు రూ.11.50 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం కామారెడ్డిలోని విజయడెయిరీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏడీని చుట్టుముట్టి బిల్లుల విషయమై నీలదీశారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాల బిల్లులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పాల బిల్లులు రావడం లేదని రైతులు ఆరోపించారు. పాల కేంద్రాల్లోని కార్యదర్శులు బిల్లులు సక్రమంగా నమోదు చేయడం లేదని రైతులు పేర్కొన్నారు.






