29 July, 2026 | 12:49 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ, బీటీ రోడ్డు నిర్మించాలి

29-07-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించి, బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరితకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ కళాశాలకు కేటాయించిన భూమి ఆక్రమణలకు గురవుతోందని, ప్రహరీ గోడ లేకపోవడంతో ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని, విద్యార్థుల సౌకర్యార్థం రోడ్డు నిర్మించాలని కోరారు.

సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమీర్, జగజంపుల తరుణ్, శివశంకర్, సాయిచరణ్, టీ. రవి, నిరోష్, లావణ్య, ముస్కాన్, వైష్ణవి, సౌమ్య, హారిక, రాను తదితరులు పాల్గొన్నారు.