29 July, 2026 | 12:49 AM

అదనపు బూత్‌లు ఏర్పాటు చేయాలని వినతి

29-07-2026 12:00 AM

హుస్నాబాద్, జూలై 28: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మండలంలోని పోతారం(ఎస్)లో ఎస్‌ఐఆర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అనంతరం హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. పోతారం(ఎస్) గ్రామంలో ఒకే బీఎల్‌ఓ పరిధిలో 1,200కు పైగా ఓటర్లు ఉండటంతో అదనపు బూత్ ఏర్పాటు చేసి ప్రత్యేక బీఎల్‌ఓను నియమించాలని కోరారు. అలాగే పొట్లపల్లి గ్రామ పరిధిలోని దేవేంద్రనగర్ ప్రజల సౌకర్యార్థం అక్కడ కూడా అదనపు బూత్ ఏర్పాటు చేసి ప్రత్యేక బీఎల్‌ఓను నియమించాలని అధికారులను కోరారు.