9 July, 2026 | 1:01 AM

ప్రభుత్వభూమి ప్రైవేట్ పరం

09-07-2026 12:12 AM

మునగనూరు ప్రభుత్వ భూములను కాపాడాలి

అక్రమ రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఎంపీ,డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

ఇబ్రహీంపట్నం, జూలై 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తొర్రూరు డివిజన్ మున గనూరు గ్రామంలో ప్రభుత్వ భూమి అక్రమగా రిజిస్ట్రేషన్ల చేసారంటు మాజీ ఎంపీ, బీజేపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మీడి యా సమావేశంలో అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను కొందరు భూ మాఫియా వ్యకులు ఆక్రమించుకుని, ప్రభుత్వ అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ,ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూమిగా ఉన్నా సర్వే నంబర్లను ఎలా రిజిస్ట్రేషన్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడు దలైన అధికారిక సమాచారంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు గ్రామంలోని సర్వే నంబర్లు 38/1, 44/4, 44/5, 46, 85, 89, 91, 127 ప్రభుత్వ భూములుగా నమోదు చేసి, సెక్షన్ 22-A కింద నిషే ధిత జాబితాలో చేర్చిన విషయం స్పష్టంగా ఉందన్నారు. అయితే, గతంలో పత్రికల్లో వెలువడిన కథనాల ప్రకారం అదే గ్రామంలోని సర్వే నంబర్లు 44/2, 44/4, 44/6, 44/8, 44/10, 44/11 భూములపై భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు, జరిగినట్లు భూ కుంభకోణం బయటపడిందని పేర్కొన్నారు.

‘ప్రభుత్వ భూములను,ఎం ఆర్ ఓ,ఆర్డి ఓ, అధికారులు ఎలా అనుమతించారు. చెప్పాలని, ప్రభుత్వం స్పందించ కపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, కందాల బలదేవ్ రెడ్డి, బోసుపల్లి ప్రతాప్  నోముల కార్తీక్ గౌ డ్, నందగిరి సురేష్, గుండా కృష్ణ,, నాగరాజు, గ్రామ వాసులు, యువకులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.