9 July, 2026 | 1:01 AM

ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. కబ్జాల ప్రభుత్వం

09-07-2026 12:13 AM
  1. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. కబ్జాలపై కన్నేసిన  కాంగ్రెస్ నేతలు
  2. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 

అబ్దుల్లాపూర్ మెట్, జులై ౮: ఇది ప్రజా ప్రభుత్వం కాదని... కబ్జాల ప్రభుత్వమని బీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అన్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్  మెట్ మండలం మునగనూరు సర్వే 44 లో ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 44లోని 12 భూమిని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడు తూ... మునగనూర్ సర్వే 44లో ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమి గత 70 ఏండ్లుగా  ప్రభుత్వ రికార్డులు ఉన్నాయన్నారు. మా ప్రభుత్వ హయంలో  ఇక్కడ ప్రభుత్వ భూ మి  బోర్డులను ఏర్పాటు చేసినట్లు  తెలిపా రు.

15 ఏళ్లపాటు  l ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా ఈ భూమిని కాపాడమని తెలిపారు. భవిష్యత్తులో కాలనీవాసుల అవసరాల కోసం వినియోగిం చాలని భావించినట్లు  పేర్కొన్నారు. కానీ ప్ర స్తుతం అధికారంలో ఉన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మల్ రెడ్డి రామ్ రెడ్డి, మెరుగు గోపాల్ యాదవ్ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఈ కబ్జాల వ్యవహారంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గతంలో విభేదాలు వచ్చినా, తర్వాత రాజీ కుదుర్చుకుని పక్కా ప్రణాళికతో కబ్జాలకు పూనుకున్నారని తెలిపారు. ముందుగా కంబాలపల్లి సులోచన పేరుపై, అనంతరం గోపాల్ పేరుతో రాత్రికి రాత్రే అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని వివరించారు. ఈ కబ్జా వ్యవహారంలో వెనుక  ఎంపీ, ఎమ్మెల్యే, సోదరుడు కీలక పాత్ర  పో షించినట్లు తెలిపారు. 15 ఏళ్లుగా ఎలాంటి వివాదం లేని ప్రభుత్వ భూములు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు కబ్జాలకు గురవుతున్నాయని ప్రశ్నించారు. 

అధికారులు 30 ఏళ్ల పాటు సర్వీస్ ఉంటుందని .. వారు ఎలాంటి రాజకీయాలకు ఒత్తిళ్లకు లోను కాకుండా.. తప్పుడు వ్యవహారాలలో తల దూర్చోద్దని అన్నారు. ఇప్పుడు తప్పు చేసి తప్పించుకున్న.. 30 ఏళ్ల సర్వీసులో  ఇప్పు డు ఒకప్పుడు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా  ఉన్న ప్రభుత్వ భూములపై  రేవంత్ రెడ్డి సర్కార్ కన్నేసిందని.. ఈ భూములను  కాంగ్రెస్ నేత ల కబంధహస్తాల్లో ఉందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ‘దోచుకో... దోచింది దాచుకో‘ అనే విధానంతో ముందుకెళుతుందన్నారు.  అదేవిధంగా తొర్రూరులో ప్రభుత్వ భూమి ని కబ్జా చేసి  విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు.  మునగనూరు సర్వేనెంబర్ 44 లో 12 ఎకరాల భూమిని కాపాడుచున్నాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల దే బాధ్యత అని అన్నారు. జిల్లా కలెక్టర్, రెవె న్యూ అధికారులు  వెంటనే స్పందించి  12 ఎకరాల ప్రభుత్వ భూమిని  కాపాడి... వెంట నే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని  కోరారు.

లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని  హె చ్చరించారు. అధికారులకు  స్పష్టమైన హెచ్చరిక ఉద్యోగులు 30-40 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారు... రాజకీయ నా యకులు ఐదేళ్లు ఏళ్లు మాత్రమే అధికారం లో ఉంటారని.. రాజకీయ నాయకుల కోసం ప్రభుత్వ భూములను కబ్జా చేయించి మీ ఉద్యోగాలను, మీ జీవితాలను ప్రమాదంలో పడేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన చివరి వరకు పోరాడుతుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కబ్జాలను సహించమని.. ఊరుకోమని తీవ్రంగా హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో  బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తు  వెంకటరమణ రెడ్డి, ఒంగేటి లక్ష్మారెడ్డి, దండెం రామ్ రెడ్డి, బీఆర్‌ఎస్  అబ్దుల్లాపూర్ మెట్ మండల అధ్యక్షులు  కొత్త కిషన్ గౌడ్,  పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.