11 June, 2026 | 1:26 AM

రాహుల్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి

11-06-2026 12:00 AM

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్

ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 27న అదృశ్యమైన రాహుల్ జూన్ 7 వరకు కనిపించకపోవడానికి గల కారణాలను వెల్లడించాలని కోరారు.

రాహుల్ మృతి హత్యా, ఆత్మహత్యా అనే అంశాన్ని పోలీసులు స్పష్టం చేయాలని, మృతదేహాన్ని ఇప్పటికీ తల్లిదండ్రులకు అప్పగించకపోవడానికి కారణాలు చెప్పాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలన్నారు. పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధిత కుటుంబానికి కళాశాల యాజమాన్యం రూ.1 కోటి, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి మరో రూ.1 కోటి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సరస్వతి, మాకాని నాగజ్యోతి, దేవదాస్, వెంకటస్వామి, ఈశ్వర్, శేఖర్, శారదా దేవి, సునీత, రేణుక, పద్మ, దేవి, లత పాల్గొన్నారు.