20న లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
జిల్లా న్యాయమూర్తి సి.హెచ్ వి ఆర్ ఆర్ వర ప్రసాద్
కామారెడ్డి, జూన్ 10 (విజయక్రాంతి): న్యాయవాదులు ఈ నెల 20న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ వి ఆర్ ఆర్ వరప్రసాద్ అన్నారు. కామారెడ్డి కోర్టులో న్యాయవాదుల అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
కేసుల విషయంలో రాజి కుదిరిచి లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం లభించే విధంగా సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సుమలత, న్యాయమూర్తులు సుధాకర్, దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది, నారాయణ, సీనియర్ న్యాయవాదులు దామోదర్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, నంద రమేష్, అమృత రావు, న్యాయవాదులు చింతల గోపి, బండారి సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






