11 June, 2026 | 1:26 AM

కామారెడ్డిలో వంట గ్యాస్ లీక్.. వ్యాపించిన మంటలు

11-06-2026 12:00 AM

ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు, కేసు నమోదు చేసిన పోలీసులు

కామారెడ్డి, జూన్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ఇంటిలో వంట చేసేందుకు గ్యాస్ పుట్టించడంతో  గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణం లోని వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న మల్లవ్వ వంట వంట చేసేందుకు గ్యాస్ ఓపెన్ చేసి మంట వెలిగించేందుకు ప్రయత్నించగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.

దీంతో మల్లవ్వ తోపాటు, మౌనిక, అలేఖ్య ఓకే ఇంటికి చెందిన వీరు ముగ్గురు గాయపడ్డారు. వారికి మంటలు అంటుకొని అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారి ని బయటకు తీశారు. గాయపడిన ముగ్గురిని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.