19 April, 2026 | 12:57 AM

సొసైటీపై సమగ్ర విచారణ జరిపించాలి

01-04-2025 01:30 AM

సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు

మునగాల మార్చి 31:-- సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడ్వాయి సొసైటీ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి పాలకవర్గంపై కఠిన చర్యలు తీసుకోవాలని  మండల సిపిఎం పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. అయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, తాడ్వాయి సొసైటీలో సుమారు గా 50 లక్షల నుండి 1 కోటి 50 లక్షల వరకు భారీ అవినీతి జరిగిందని అన్నారు.

తాడువాయి సొసైటీలో జరుగుతున్న అవకతవకలను గత నెల రోజుల నుండి జరుగుతున్న విచారణ లో సీఈఓ నాగేందర్, ఎస్ ఏ కోటయ్య, కంప్యూటర్ ఆపరేటర్ షేక్ పర్వీన్ లు కాకుండా పాలకవర్గం సొసైటీ చైర్మన్ తొగరు సీతారాములు అవినీతికి పాల్పడినట్టుగా రుజువైంది. అన్నారు ఈ కార్యక్రమంలో చందా చంద్రయ్య బచ్చలకూరి స్వరాజ్యం. సుందరయ్య వెంకన్న పాల్గొన్నారు.