రేంజ్ రోవర్ కారు దగ్ధం
01-04-2025 01:32 AM
నల్లగొండ, మార్చి 31 (విజయక్రాంతి) : రేంజ్ రోవర్ కారు ఇంజిన్లో అకస్మికంగా మంటలు పూర్తిగా దగ్ధమైంది. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు సమీపంలో నార్కెట్పల్లి-అద్దంకి రహదారిపై సోమవారం ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు వెంట నిలిపాడు.
అందులోని వారు కిందికి దిగడంతో క్షణాల్లో మంటలు వ్యా పించి కారు పూర్తిగా పూర్తిగా కాలిపోయింది. కళ్లముందే లక్షల విలువైన కారు అగ్నికి ఆహుతి కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారం తా నిర్వేదంలో మునిగిపోయారు. సాంకేతిక లోపం కారణంగానే కారు దగ్ధమైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం.






