24 May, 2026 | 1:26 AM

గంజాయి ముఠా అరెస్టు

18-06-2024 12:05 AM
  • 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సూర్యాపేట, జూన్ 17(విజయక్రాంతి): యువతకు గంజాయిని విక్రయిస్తున్న మూఠాను నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మిర్యాలగూడలో డీఎస్పీ రాజశేఖర్ వివరాలను వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన సాకెటి తిరుపతినాయుడు, సాకేటి పోలినాయుడు విశాఖ పట్నం జిల్లా పాడేరులో బాబి అనే వ్యక్తి వద్ద గంజాయిని కొని రైలు మార్గంలో పల్నాడుకు తరలిస్తారు. అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలోని దామరచర్ల, మిర్యా లగూడెంకు తరలించి చిన్న, చిన్న పొట్లాలుగా ప్యాకింగ్ చేసి యువతకు విక్రయి స్తున్నారు.

వీరికి అడవిదేవులపల్లి మండలానికి చెందిన కొంగ ప్రతాప్, పాలకీడు మండలానికి చెందిన నందిపాటి నవీన్, దామరచర్ల మండలానికి చెందిన సిగపట్ల మహేస్, కలిమెల కిశోర్, తురుక రమేష్, మిర్యాలగుడం పట్టణానికి చెందిన సంగో జు కార్తిక్, జగతికుమార్, జగతి కోటేష్, ఖాజా, మూడావత్ రమేష్ సహకరిస్తున్నారకు. 12 మంది కలిసి సోమవారం వాడ పల్లిలో రైల్వే అండర్‌పాస్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 6 కేజీల గంజాయి, రూ.46 వేల నగదు, మూడు బైకులు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.