కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తూట్లు పొడిచే కుట్ర
మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణ్రావు
కరీంనగర్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): ఎన్నికల సమయంలో ఆడబిడ్డల వివాహానికి ’తులం బంగారం’ ఇస్తామని ఆర్భాటంగా హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట నిలబెట్టుకోలేక కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తూట్లు పొడిచే కుట్రలకు తెరలేపిందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణ్ రావు ధ్వ జమెత్తారు. సోమవారం నగర బీఆర్‌ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు మా ట్లాడుతూ తులం బంగారం ఇవ్వడం చేతకాక, మరోవైపు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేసేందుకు ప్రభుత్వమే తెరవెనుక నుండి హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చిందని ఆయన ఆరోపించారు.
తులం బంగారం ఇవ్వడం చేత కాక, మరోవైపు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేసేందుకు ప్రభుత్వమే తెరవెనుక నుండి హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రం థాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమా ర్, కార్పొరేటర్లు నలువాల రవీందర్, యూ సుఫ్, మాజీ కార్పొరేటర్లుఎడ్ల సరిత అశోక్, గందె మాధవి మహేష్, దిండిగాల మహేష్, ఎదుల్లా రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.






