18 August, 2026 | 3:02 AM

బీజేపీకి వ్యతిరేకంగా దళితులు సంఘటితం కావాలి

18-08-2026 12:00 AM

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు

కరీంనగర్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): దళితుల పట్ల బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ దళితులంతా సంఘటితం కావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఖర్గేకు జరిగిన అవమానానికి నిరస నగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లో నిర్వహిం చిన ధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు.

మల్లికార్జున ఖర్గే కు జరిగిన అవమానాన్ని తేలికగా తీసుకోవద్దని, దళితుల ఆత్మాభిమానం, అస్థిత్వంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. దళితులను అవమానించడం కమలనాధులకు కొత్తేమీ కాద ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను మొదలుకొని మల్లికార్జున ఖర్గే వరకూ కొనసాగిందన్నారు. ప్రజల మధ్య మతం, కులం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే శక్తులను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యు ల అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, స్వామి గౌడ్, వెన్న రాజ మల్లయ్య సిరాజ్ హుస్సేన్, అబ్దుల్ రెహమాన్, ముస్తాక్ అహ్మద్, మాతంగి అనిల్, రెడ్డవేని రాజు, బోయిన విద్యాసాగర్, అల్వాల కోటి, జీడి రమేష్, ఆసంపల్లి శ్రీనివాస్, యనమల మంజుల, ములకల కవిత, మమత, తిరుమల, సముద్రాల అజయ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు బత్తుల పరుశురాములు, సముద్రాల లక్ష్మణ్, ఆరేపల్లి రాహుల్, వాసాల శ్రీనివాస్, కీర్తి కుమార్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.