18 August, 2026 | 3:06 AM

కాంగ్రెస్ హయాంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

18-08-2026 12:00 AM

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి, ఆగస్టు 17 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు. సోమవారం రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఎలుక సునీతరాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తిరుప తి యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన మాట ప్రకారం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. నిర్మాణా లు పూర్తయిన కొద్దీ తదుపరి విడతల్లో మరి న్ని ఇళ్లు మంజూరు అవుతాయని తెలిపారు.

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అంది స్తామని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మంథని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోడ్డ బాపన్న, గ్రామ సర్పంచ్ ఇల్లందుల సంజీవ్, మాజీ సర్పంచ్ వేపచెట్టు రాజేశం, గ్రామ శాఖ అధ్యక్షులు బుచ్చయ్య, మాజీ ఉపసర్పంచ్ అట్టే తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు, ఉపసర్పంచ్ మేకల శ్రీ శైలం, వార్డు సభ్యులు వినోద్, అరెలి సా యిలు, మెడగొని మల్లేష్, మల్లేష్, జక్కుల గణేష్, మండే కుమార్, మడిపెల్లి శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్రెడ్డి, అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.