calender_icon.png 4 May, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మర్‌లో చల్లని విహారం!

04-05-2025 12:24:07 AM

ఎండలు దంచికొడుతున్నాయి. పిల్లలకేమో సెలవులిచ్చేశారు. ఇక ఈ వేసవిలో ఎటైన విహార యాత్రలకు వెళ్తేబాటుంటుందని ఆలోచిస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం కుటుంబమంతా ఆహ్లాదంగా గడపడానికి ఎన్నో పర్యాటక ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ సమ్మర్ వెకేషన్‌లో కుటుంబంతో కలిసి ప్లాన్ చేస్తుంటే ఈ ఐదు ప్రదేశాలు మాత్రం మిస్ కాకండి. మీకు ఈ వేసవిలో ఎంతో మధురానుభూతిని పంచుతాయి. ఆ పర్యాటక ప్రాంతాలేంటో తెలుసుకుందాం రండి..!

డార్జిలింగ్: అందమైన తేయాకు తోటలు, కలోనియల్ ఆర్కిటెక్చర్ కు తూర్పు ఇండియాలోని డార్జిలింగ్ పట్టణం ప్రసిద్ధి. ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. నగర వీధులు, రహదారులు, పర్వతాలు మధ్య గుండా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. పర్వతారోహణను ఇష్టపడేవారి కోసం హిమాలయన్ మౌంటె నీరిం గ్ ఇనిసస్టిట్యూట్ కూడా ఇక్కడ ఉంది.

మనాలి: హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టంలో ఉన్న మనాలి వేసవిలో విహరించడానికి ఒక చల్లని ప్రదేశం. హిమాలయాల ఉత్కంఠభరితమైన దృశ్యాలను కనులారా వీక్షించవచ్చు. ఇంకా, ఈ సుందరమైన హిల్ స్టేషన్లో ట్రెక్కింగ్, క్యాంపింగ్, వంటి ఇతర అడ్వెంచర్ గేమ్స్‌ను ఆస్వాదించవచ్చు.

రిషికేశ్: ఆధ్యాత్మిక అనుభూతిని ఇష్టపడే వారికి రిషికేశ్ సరైన గమ్యస్థానం. ప్రపంచం యోగా రాజధానిగా ప్రసిద్ధి చెందిన రిషికేశ్ పట్టణంలో మీరు ధ్యానం, యోగా అందించే శిక్షణ కేంద్రాలను సందర్శించవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు.

భారతీయ ఆధ్యాత్మికత గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇక్కడ ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు, ఆశ్రమాలను కూడా అన్వేషించవచ్చు. ఇక్కడి గంగానది ఒడ్డున ఉన్న నీలకంఠ మహదేవ ఆలయం దక్షిణ భారత ద్రవిడ నిర్మాణశైలిని కలిగి ఉండటం విశేషం.

ఊటీ: దక్షిణ భారతంలో సుప్రసిద్ధ ఊటీ. దీన్నీ ‘క్వీన్ ఆఫ్ ది హిల్స్’గా పిలుస్తుంటారు. నీలగిరి పర్వత శ్రేణులు, పచ్చదనంతో నిండిన హిల్‌స్టేషన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఊటీలో చూడదగిన ప్రదేశాల్లో నీలగిరి పర్వత ప్రాంతాల నుంచి రైలు ప్రయాణం తవినితీరా చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది.

అలాగే బొటానికల్ గార్డెన్, పైకార సరస్సు, దొడ్డబెట్ట శిఖరం, ఏకోరాక్, రోజ్‌గార్డెన్, డాల్ఫిన్స్ నోస్ తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇక ఏప్రిల్‌లో ఊటీలో సగటు ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల వరకు ఉంటుంది.

కొడైకెనాల్: దక్షిణ భారతంలోనే ఉన్న మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్. దీన్ని ‘ప్రిన్సెస్ ఆఫ్ హీల్స్’గా పిలుస్తారు. ఇక్కడి పచ్చదనం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. కొండలు, లోయలతో ప్రకృతి రమణీయత ప్రకృతి ప్రేమికులను మనసులను దోచేస్తుంది. ఈ ప్రాంతం హనీమూన్ వెళ్లే జంటలకు ఎంతో అనుభూతిని ఇస్తుంది.

వేసవిలో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చల్లని గాలులను ఆస్వాదించడం కోసం నలుమూల నుంచి పర్యాటకులు తరలివస్తారు. ఏప్రిల్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కొడైకెనాల్‌లోని ప్రధాన సందర్శనా స్థలాల్లో గ్రీన్ వ్యాలీ వ్యూపాయింట్, బేర్ షోలా జలపాతం, కోకర్స్ వాక్ ఉన్నాయి.