04-05-2025 02:48:40 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(BRS MLA Tanniru Harish Rao) మరోసారి మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి, పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవే(Mumbai National Highway)పై లారీ బోల్తాపడడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు.వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకొని, స్థానికులు, వెంట ఉన్న సిబ్బంది, బీఆర్ఎస్ నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీశారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి పంపించారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.