calender_icon.png 4 May, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐ.డి పొందాలి

04-05-2025 02:58:22 PM

 వ్యవసాయ సహాయసంచాలకులు సునీత.

హుజురాబాద్,విజయక్రాంతి: వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్రప్రభుత్వం(Central Government) ప్రతి రైతుకూ 11 అంకెల యూనిక్ ఫార్మర్ ఐ.డి (గుర్తింపు సంఖ్య)ను అందించనున్నట్టు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సునీత(Assistant Director of Agriculture Department Sunitha) తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సహాయ వ్యవసాయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ....  రైతులు పి.యం. కిసాన్ సమ్మాన్ నిధి, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలను భవిష్యత్తులో పొందాలంటే ఈ ఫార్మర్ ఐ.డి తప్పనిసరి అవుతుందని పేర్కొన్నారు.

మే 5 నుంచి గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోనే నమోదుప్రక్రియను ప్రారంభించనున్నారు.భూమి ఉన్న ప్రతి రైతు, తన భూమికి సంబంధించిన వివరాలతో సహా ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారులను, సమీప మీ-సేవ కేంద్రాన్ని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలిఈ ఫార్మర్ ఐ.డి రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, రుణ మాఫీతో సంబంధం లేకుండా ఉంటుందని స్పష్టం చేశారు.